ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
- ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ 2026
- టోర్నమెంట్ అత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ
- భారత్ నుంచి ఒక్కరికే చోటు
- ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Announced Women’s T20 World Cup 2026 Team: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విష్వవిజేతగా నిలిచింది. ఒత్తి ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్ నుంచి మాత్రం ఒక్కరికే చోటు దక్కింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలకు ఈ జట్టులో స్థానం దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐసీసీ కెప్టెన్ సోఫీ మోలినెక్స్:
టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ బెత్ మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఆమెతో పాటు ఎలీస్ పెర్రీ, యాష్ గార్డ్నర్, కెప్టెన్ సోఫీ మోలినెక్స్, ఆల్‌రౌండర్ మారిజానే కాప్ ఐసీసీ జట్టులో చోటు సంపాదించారు. ఇంగ్లండ్ ఓపెనర్ డానీ వ్యాట్-హాడ్జ్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఏడు మ్యాచ్‌ల్లో 302 పరుగులు చేసి మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 300కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. శ్రీలంకపై అజేయ శతకం బాదిన ఆమె మరో రెండు అర్ధశతకాలతో అద్భుత ఫామ్‌ను కొనసాగించింది.
Also Read
- Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
- Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
ఎలీస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రతిభ:
ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ.. నాలుగు మ్యాచ్‌ల్లోనే 227 పరుగులు చేసి తన క్లాస్‌ను మరోసారి నిరూపించింది. సెమీఫైనల్లో జట్టును ఆదుకుంటూ 75 పరుగులు చేయగా.. ఫైనల్లోనూ అజేయంగా 58 పరుగులు చేసింది. సీనియర్ ఎలీస్ పెర్రీ మరోసారి తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకుంది. టోర్నమెంట్లో 198 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీసి జట్టుకు కీలక విజయాలు అందించింది. భారత్‌పై అజేయంగా 56 పరుగులు చేయడంతో పాటు, పాకిస్థాన్‌పై 2/9 గణాంకాలతో మెరిసింది.
పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమాకు చోటు:
ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ మెగా టోర్నమెంట్లో సంచలన ప్రదర్శన చేసింది. 181 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి తన జట్టుకు అద్భుత విజయాలను అందించింది. అలాగే శ్రీలంక ఓపెనర్ నిలాక్షికా సిల్వా 148 పరుగులు చేసి ఆకట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌పై అజేయ అర్ధశతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానే కాప్.. బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన కనబరిచింది. 124 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు తీసి తన జట్టును సెమీఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కూడా 11 వికెట్లతో బౌలర్లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
శ్రీ చరణి మాత్రమే:
భారత్ తరఫున స్పిన్నర్ శ్రీ చరణి మాత్రమే ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు దక్కించుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన ఆమె టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన భారత బౌలర్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2018 ప్రపంచకప్‌లో పూనమ్ యాదవ్ 10 వికెట్లు తీసిన రికార్డును శ్రీ చరణి అధిగమించింది. అలాగే స్కాట్లాండ్ ఓపెనర్ డార్సీ కార్టర్ 208 పరుగులతో 12వ ప్లేయర్‌గా ఎంపికైంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టీమ్:
డానీ వ్యాట్-హాడ్జ్ – (ఇంగ్లండ్)
బెత్ మూనీ (ఆస్ట్రేలియా) – వికెట్ కీపర్
నాట్ స్కివర్-బ్రంట్ – (ఇంగ్లండ్)
ఎలీస్ పెర్రీ -(ఆస్ట్రేలియా)
ఓర్లా ప్రెండర్‌గాస్ట్ – (ఐర్లాండ్)
నిలాక్షికా సిల్వా – (శ్రీలంక)
మారిజానే కాప్ – (దక్షిణాఫ్రికా)
యాష్ గార్డ్నర్ – (ఆస్ట్రేలియా)
ఫాతిమా సనా – (పాకిస్థాన్)
సోఫీ మోలినెక్స్ – (ఆస్ట్రేలియా – కెప్టెన్)
శ్రీ చరణి – (భారత్)
డార్సీ కార్టర్ (స్కాట్లాండ్) – 12వ ప్లేయర్
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!