Site icon NTV Telugu

టీ20ల్లో కొత్త రూల్స్.. ఇక బౌలింగ్‌ టీమ్ జాగ్రత్త పడాల్సిందే..!!

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈనెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధన ఆసక్తి రేపుతోంది. ఇక నుంచి బౌలింగ్ జట్టు స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడితే మైదానంలో 30 గజాల సర్కిల్ బయట ఉండే ఫీల్డర్‌లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. స్లో ఓవర్ రేటుకు పడే జరిమానాకు ఇది అదనం అన్నమాట.

Read Also: అజేయ రికార్డు హుష్‌కాకి… ఓటమితో కొత్త ఏడాదికి స్వాగతం

అంతేకాకుండా ఐపీఎల్ తరహాలో ప్రతి ఇన్నింగ్స్‌కు మధ్యలో ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చని ఐసీసీ తెలిపింది. ఈ బ్రేక్ రెండున్నర నిమిషాలు ఉండవచ్చు. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ నిబంధన ఉండాలంటే.. రెండు జట్లు సిరీస్ ప్రారంభానికి ముందే దీనికి అంగీకరించి ఉండాలి. అటు బంతిలో 50 శాతం బెయిల్స్‌కు తగిలినప్పుడు దాన్ని ఎల్బీడబ్ల్యూగా పరిగణించాలని తాజాగా ఐసీసీ నిర్ణయించింది. పాత రూల్ ప్రకారం.. బంతి బెయిల్స్‌కు తగిలినా.. అది అంపైర్స్ కాల్‌గానే పరిగణించేవారు.

Exit mobile version