శ్రీలంక కికెట్ ఆటగాడు వనిందు హసరంగకు ఐసీసీ భారీ షాకిచ్చింది. తాజగా హసరంగపై ఐసీసీ రెండు టెస్ట్‌ల నిషేధం ఐసీసీ ప్రవర్తనా నియామళి ఉల్లంఘన కింద విధించింది. ఇకపోతే తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కొన్ని గంటలలోనే హసరంగపై వేటు పడడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ పట్ల హసరంగ దురుసుగా ప్రవర్తించాడు.
Also read: DMK Manifesto: డీఎంకే మేనిఫెస్టోలో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ నిషేధం హమీలు
హసరంగ తన ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి తన క్యాప్ ను అమాంతం బలంగా లాక్కున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న 37వ ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై గాను ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీనిని నేరంగా పరిగణించింది ఐసీసీ. దీంతో హసరంగకు తన మ్యాచ్ ఫీజులో 50% కోత విధించడంతోపాటు మరో 3 డీమెరిట్ పాయింట్లను జారీ చేశారు. దీనితో హసరంగ ఖాతాలో ఇదివరకే ఉన్న 5 డీమెరిట్ పాయింట్లతో కలిపి.. మొత్తంగా డీమెరిట్ పాయింట్ల సంఖ్య 8కు చేరుకుంది. ఈ నేరం కింద హసరంగ పై 2 టెస్టులు లేదా 4 వన్డేలు లేదా 4 టీ20ల నిషేధం విధించబడుతుంది.
Also read: Vanga Geetha: ఆయనను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.. పవన్‌కు వంగా గీత స్ట్రాంగ్ కౌంటర్
ఇక ఇందులో ఏది మొదటగా మ్యాచ్ లు జరిగితే దానిపై నిషేధం ఎదుర్కొవలసి వస్తుంది సదరు ఆటగాడు. ఈ విధంగా చూస్తే శ్రీలంక జట్టు తర్వాత టెస్టులు ఆడనుంది. కాబట్టి హసరంగ పై 2 టెస్టుల నిషేధం పడింది. ఈ కారణంతో బంగ్లాదేశ్ తో శ్రీలంక ఆడే రెండు టెస్టుల సిరీస్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఒకవేళ హసరంగ కానీ టెస్టు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోక ఉంది ఉంటే.. 4 టీ20లకు దూరం కావాల్సి వచ్చేది. ఇకపోతే హసరంగ పై నిషేధం విధించడం ఇదేమి మొదటిసారి కాదు. ఇదివరకు అప్ఘానిస్థాన్ తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా కూడా పలు తప్పిదాలకు పాల్పడి నిషేధంను కూడా ఎదురుకున్నాడు.