Site icon NTV Telugu

IPL: గుజరాత్‌ దూకుడుకు బ్రేక్‌లు.. హైదరాబాద్‌ సెకండ్‌ విక్టరీ..

Ipl

Ipl

ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్‌… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా, అభినవ్‌ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.

Read Also: Cabinet: ముగుస్తున్న డెడ్‌లైన్‌… కేసీఆర్‌ కీలక నిర్ణయం..!?

ఇక, 163 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్‌ దిగిన హైదరాబాద్‌కు మంచి స్టార్టింగ్ దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్‌ విలియమ్స్ ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 32 బంతుల్లో 42 పరుగులు చేసి అభిషేక్‌ శర్మ ఔట్ అయ్యాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన కెప్టెన్ కేన్‌ విలియమ్స్‌ 57 పరుగులు చేశాడు. 17 రన్స్ చేసిన రాహుల్ త్రిపాఠీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరగా… నికోలస్‌ పూరన్, ఎయిడెన్‌ మర్కరమ్ టార్గెట్ ఫినిష్ చేశారు. పూరన్‌ 34, మర్కరమ్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే… టార్గెట్ ఛేజ్ చేసింది సన్‌ రైజర్స్. సన్‌రైజర్స్ విక్టరీలో కీ రోల్ ప్లే చేసిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ టైటన్స్‌ ఈ మ్యాచ్‌లో చావు దెబ్బ తింది.

Exit mobile version