U-19 Asia Cup Semi-Finals: అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో భారత్, శ్రీలంక తలపడాల్సి ఉంది. అయితే, భారీ వర్షం కారణంగా ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాలేదు. కనీసం ఇప్పటి వరకు టాస్ కూడా పడలేదు. ప్రస్తుతం వాన ఆగిపోయినప్పటికీ ఔట్ ఫీల్డ్ మాత్రం తడిగా ఉంది. మరోవైపు, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య ది సెవన్స్ గ్రౌండ్ లో జరగాల్సిన మరో సెమీఫైనల్ మ్యాచ్ పరిస్థితి కూడా ఇదే. కాగా, సెమీ ఫైనల్స్‌కు రిజర్వ్ డే లేకపోవడంతో ఒకవేళ ఈ మ్యాచ్‌లు రద్దైతే పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్ టీమ్‌లు ఫైనల్‌కు వెళ్తాయి.
Read Also: Adivi Sesh : సినిమాల రిలీజ్ విషయంలో రాజమౌళి స్ట్రాటెజీనీ ఫాలో అవుతున్న అడివి శేష్
అయితే, గ్రూప్- ఏ నుంచి భారత్, గ్రూప్- బీ నుంచి బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఆదివారం (డిసెంబర్ 21న)న ఐసీసీ అకాడమీ స్టేడియం వేదికగా కొనసాగనుంది. ఇక, టోర్నమెంట్లో ఇప్పటికే సెంచరీ, హాఫ్ సెంచరీతో సహా 226 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది.
ఇరు జట్లు:
అండర్-19 భారత్ క్రికెట్ జట్టు: ఆయుష్ మహత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, యువరాజ్ గోహిల్, ననిష్క్ చౌహన్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్ మరియు ఆరోన్ జార్జ్.
అండర్-19 శ్రీలంక క్రికెట్ జట్టు: దిమంత మహావితాన, విరాన్ చముదిత, కిత్మా వితానపతిరన, కవిజ గమగే, విమత్ దిన్సార (కెప్టెన్), చమిక హీనతిగల, ఆధమ్ హిల్మీ, దుల్నిత్ సిగెరా, సేత్మిక సెనెవిరత్నే, రసిత్ నిమ్సరా, థుస్సారా నృగాస్, విఘ్నేశ్వరన్ కుదృగవ, మతులనృగాష్, మతులనృగాష్, మతులనృగాష్, సనుజ నిండువార.