PSL vs IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విమర్శించిన పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద బాధ్యతలు అప్పగించింది. రాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సీజన్‌కు వసీమ్ అక్రమ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇది పీఎస్‌ఎల్ చరిత్రలో అక్రమ్‌కు ఇదే తొలిసారి. ఇటీవల లండన్‌లో జరిగిన పీఎస్‌ఎల్ ఈవెంట్‌లో మాట్లాడిన వసీమ్ అక్రమ్.. ఐపీఎల్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. “పీఎస్‌ఎల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం 34 రోజులు మాత్రమే జరుగుతుంది. మూడు నెలలు సాగే ఇతర లీగ్‌ల వలే కాదు.. పిల్లలు పెద్దవాళ్లు అవుతారు కానీ, ఆ లీగ్ మాత్రం ముగియదు అంటూ ఐపీఎల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, వసీమ్ అక్రమ్ 2009 నుంచి 2016 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. ఆయన కోచింగ్‌లోనే కేకేఆర్ 2012, 2014 సంవత్సరాల్లో రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. అయితే, 2017 ఐపీఎల్‌కు ముందు అక్రమ్ కేకేఆర్‌ను వీడగా, అప్పటి నుంచి ఐపీఎల్‌కు దూరంగానే ఉన్నారు.
Read Also: Nidhhi Agerwal : పవన్–ప్రభాస్ మల్టీస్టారర్‌పై కన్నేసిన నిధి అగర్వాల్..
అయితే, ఈసారి పీఎస్‌ఎల్, ఐపీఎల్‌తో పోటీ పడబోతుంది. పీఎస్‌ఎల్ 2026 మార్చి 23 నుంచి మే తొలి వారం వరకు కొనసాగనుంది. అదే సమయంలో మార్చి 26 నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ నిర్వహించనున్నట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌కు ఇది మరో భారీ సీజన్ కానుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరిగింది.
ఇక, 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల వారు మళ్లీ ఐపీఎల్‌లో ఆడలేదు.. అయితే, మాజీ పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అజర్ మహ్మద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్‌లో పాల్గొ్న్నాడు. ఇక, పీఎస్‌ఎల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క భారత ఆటగాడు కూడా ఆ లీగ్‌లో పాల్గొనలేదు. భారత క్రికెటర్లకు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే, రిటైర్డ్ క్రికెటర్లు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్‌లలో పాల్గొనవచ్చు. ఐపీఎల్ పై చేసిన విమర్శలతో వసీం అక్రమ్ నను పీఎస్‌ఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం మరింత చర్చకు దారి తీసింది.
