Site icon NTV Telugu

విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి ముద్దాడిన హిమాచల్‌ప్రదేశ్

విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్‌ప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన ఫైనల్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఓపెనర్ శుభమ్ అరోరా అజేయ సెంచరీ (136)తో అదరగొట్టాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అమిత్ కుమార్ 74, కెప్టెన్ రిషి ధవన్ 42 (నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

https://ntvtelugu.com/the-central-government-has-set-up-a-committee-to-repeal-the-armed-forces-special-powers-act/

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సెంచరీ (116), ఇంద్రజిత్ 80 పరుగులతో విరుచుకు పడడంతో భారీ స్కోరు సాధించింది. హిమాచల్‌ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రిషి ధవన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 315 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్ దూకుడుగా ఆడింది.ఈ క్రమంలో 47.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. అప్పటికి వెలుతురు మందగించడంతో వీజేడీ పద్ధతిలో హిమాచల్‌ప్రదేశ్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్ జట్టు శిబిరంలో అంబరాలు మిన్నంటాయి. హిమాచల్‌ప్రదేశ్‌కు ఇదే తొలి దేశవాళీ టైటిల్ కావడం గమనార్హం. 131 బంతుల్లో 136 పరుగులు చేసిన శుభమ్‌ అరోరాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Exit mobile version