NTV Telugu Site icon

IND vs NZ Match: ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. విడతల వారీగా విక్రయాలు.. అజారుద్దీన్ స్పష్టం

Azharuddin Ind Vs Nz

Azharuddin Ind Vs Nz

HCA President Azharuddin Gives Clarity On India vs New Zealand Match Tickets: ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజీల్యాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక అవుతుండటంతో, క్రీడాభిమానులు స్టేడియంలో ఈ మ్యాచ్ చూసేందుకు ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అజారుద్దీన్ తాజాగా టికెట్ల విషయంపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈసారి ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇవ్వడం లేదని, ఆన్‌లైన్‌లోనే అమ్ముతామని స్పష్టం చేశారు. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. విడతల వారీగా టికెట్ అమ్మకాలుంటాయన్నారు. జనవరి 13న 6 వేలు, జనవరి 14న 7 వేలు, జనవరి 15న 7 వేలు, జనవరి 16న మిగతా టికెట్లను అమ్మడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. మొత్తం స్టేడియం కెపాసిటీ 39,112 కాగా.. 29417 టికెట్లు అమ్మకానికి పెట్టామని, మిగిలిన 9695 టికెట్స్ కాంప్లిమెంటరీ టికెట్స్ అని చెప్పారు.

Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి

అయితే.. మ్యాచ్‌కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు.. ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకునేవారు కేవలం 4 టికెట్స్ మాత్రమే తీసుకోవాలన్నారు. జనవరి 14న న్యూజీల్యాండ్ టీమ్ హైదరాబాద్‌కి వస్తుందని, 15న సాయంత్రం ప్రాక్టీస్ చేస్తుందని తెలిపారు. అనంతరం జనవరి 16న టీమిండియా హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 18వ తేదీన ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. మధ్యాహ్నం 1:30 నుంచి 5 గంటల వరకు తొలి ఇన్నింగ్స్.. సాయంత్రం 5:45 నుంచి 9:15 వరకు రెండో ఇన్నింగ్స్ ఉంటుందన్నారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్ ఇబ్బందులు కూడా లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్య.. ఆ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్