ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ సేన ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి మెగా ట్రోఫీని తొలిసారి ముద్దాడింది. టోర్నీలోని లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుని.. సెమీస్ చేరింది. సెమీఫైనల్లో పటిష్ట ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లుతో పాటు భారీ నజరానాలు కూడా కురిశాయి.
Also Read: Rishabh Pant: దేవుడు ఎంతో దయగలవాడు.. రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీమిండియా మహిళలు వరుస కార్యక్రమాలు, ఇంటర్వ్యూలల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెన్నైలోని ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి విద్యార్థులు ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు హర్మన్‌ప్రీత్ సమాధానాలు ఇచ్చారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అని ఓ స్టూడెంట్ అడగగా.. ధోనీ అని తక్కువ సమాధానం ఇచ్చింది. అలానే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనకు స్ఫూర్తిదాయకమని చెప్పింది. తనకు టెస్ట్ ఫార్మాట్ అంటే ఇష్టమని మరో విద్యార్థికి ఆన్సర్ ఇచ్చింది. మెగా టోర్నీలో హర్మన్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించింది.
