NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్‌పై పెదవి విప్పిన పాక్ బౌలర్ హారీస్ రౌఫ్..

Virat Kohli Six

Virat Kohli Six

Haris Rauf BREAKS Silence On Virat Kohli’s Iconic Sixes At MCG During T20 World Cup: ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ అన్ని మ్యాచులు ఒకెత్తు అయితే.. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ మరో ఎత్తు. టోర్నీకే ఈ మ్యాచ్ వన్నె తీసుకువచ్చింది. విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచుకు 90 వేలకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఓటమి అంచుల్లో ఉన్న భారత జట్టును విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ గెలిపించింది.

Read Also: USA: అమెరికా మారదు.. పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన

అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్స్ మాత్రం క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో హారీస్ రౌఫ్ బౌలింగ్ లో వరసగా రెండు సిక్సులు కొట్టాడు కోహ్లీ. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ ఓటమి అంచులో ఉన్న సమయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కోహ్లీ. ఈ రెండు సిక్సులే భారత ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చి గెలుపు తీరాలకు చేర్చాయి. రెండు సిక్సుల్లో నేరుగా కోహ్లీ కొట్టిన సిక్సు ఆ మ్యాచుకే హైలెట్ గా నిలిచింది.

అయితే నెల రోజుల తర్వాత పాకిస్తాన్ బౌలర్ హారీస్ రౌఫ్ ఈ సిక్సు గురించి పెదవి విప్పాడు. కోహ్లీ తప్ప మరెవ్వరూ కూడా ఈ షాట్ కొట్టలేరని..కోహ్లీ బ్యాటింగ్ ‘క్లాస్’ అంటూ కొనియాడాడు. భారత జట్టుపై నా ప్లాన్స్ అమలు చేశానని.. అయితే కోహ్లీ నా బౌలింగ్ లో సిక్సు కొట్టాడని.. అయితే ఆ షాట్ హార్ధిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ కొట్టి ఉంటే బాధపడేవాడినని అన్నారు. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది.