Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Trade to KKR Ahead of IPL 2027: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రేడ్ విషయంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై ఇండియన్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టులోకి హార్దిక్ మారడం దాదాపు ఖరారైందని ఆ వార్త సారాంశం. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయట. అక్టోబర్ 11న కేకేఆర్ హార్దిక్ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్రేడ్‌పై ఇప్పటివరకు అటు ముంబై, ఇటు కోల్‌కతా ప్రాంఛైజీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కోల్‌కతా భారీ ఆఫర్:
హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ భారీ ఆఫర్ చేసిందట. స్టార్ ప్లేయర్స్ రామ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఇచ్చేందుకు కేకేఆర్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ముంబైకి వెళితే.. హార్దిక్ కేకేఆర్‌లోకి వస్తాడు. ఇప్పటికే ముంబై, కోల్‌కతా మధ్య ఈ ట్రేడ్ డీల్ పూర్తయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ ట్రేడ్ వార్తలు అయినా నిజమవుతాయా లేదో.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
చెన్నై, గుజరాత్ నుంచి ఆఫర్లు:
మరోవైపు హార్దిక్ పాండ్యాకు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ నుంచి కూడా ట్రేడ్ ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఆయా ఫ్రాంచైజీల నుంచి తనకు కెప్టెన్సీ బాధ్యతలు కావాలని హార్దిక్ కోరినట్లు, ఆ డిమాండ్‌కు వారు అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో చివరకు కేకేఆర్ వైపు హార్దిక్ మొగ్గుచూపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. హార్దిక్ భవిష్యత్తుపై ఇప్పటికే ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా ట్రేడ్ వార్తలు ఐపీఎల్ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచాయి. అయితే ట్రేడ్ డీల్ నిజమా అని తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
నాయకుడు అవసరం:
హార్దిక్ పాండ్యా నిజంగానే కేకేఆర్‌లో చేరితే జట్టు కాంబినేషన్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. హార్దిక్ ఆల్‌రౌండర్ కాబట్టి.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు నాయకత్వ అనుభవం కేకేఆర్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. గత రెండు సీజన్లుగా కేకేఆర్ నిరాశపరుస్తోంది. అజింక్య రహానే సారథ్యంలో చెత్త ప్రదర్శన చేసింది. జింక్స్ ఆటకు వీడ్కోలు పలికిన నేపదంలో.. కోల్‌కతా ఇప్పుడు నాయకుడు అవసరం. ఈ నేపథ్యంలోనే హార్దిక్ కోసం గట్టిగానే ట్రై చేస్తుందట.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!