NTV Telugu Site icon

Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు

Hardik On Sudarshan

Hardik On Sudarshan

Hardik Pandya Praises Sai Sudarshan: ఢిల్లీలో మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ గెలుపులో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఓపెనర్లిద్దరూ వెనువెంటనే ఔటవ్వడంతో.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా విఫలమైనప్పుడు.. సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి, తన జట్టుని గెలిపించుకున్నాడు. ఇతనికి విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ కూడా మద్దతిచ్చారు కానీ.. ఒకవేళ సాయి లేకపోతే గుజరాత్‌కి ఈ గెలుపు దాదాపు అసాధ్యం. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ, అతడు ఆచితూచి ఆడుతూ.. లక్ష్యం దిశగా జట్టుని తీసుకెళ్లాడు. ఎట్టకేలకు తన జట్టుని గెలిపించుకొని, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Dharmavaram Erraguttta: ఎర్రగుట్టే హాట్ టాపిక్.. ఏమా కథాకమామీషు?

ఈ నేపథ్యంలోనే సాయి సుదర్శన్‌పై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఒత్తిడి సమయంలో అతడు ఆడిన ఇన్నింగ్స్.. నిజంగా మెచ్చుకోదగినదని.. మాజీలు సహా క్రికెట్ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చేరిపోయాడు. అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఘనత అంతా.. అతనితో పాటు అతనికి సపోర్ట్‌గా నిలిచిన వారికి దక్కుతుంది. గత 15 రోజుల్లో అతడు చేసిన బ్యాటింగ్, శ్రమ ఫలితాలను మీరు చూస్తూనే ఉన్నారు. అతడు ఇలాగే నిలకడగా రాణిస్తే.. రానున్న రోజుల్లో ఫ్రాంచైజీ క్రికెట్‌కు గొప్ప సేవలు అందిస్తాడు. భారత జట్టుకి కూడా తురుపుముక్కగా అవతరిస్తాడు’’ అంటూ హార్దిక్ కొనియాడాడు.

Rashmika: శ్రీవల్లీ.. ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నావా.. అంత తెల్లగా అయినావ్

కాగా.. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్‌ను కేవలం రూ.20 లక్షల బేస్ ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. అతగాడు 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 లక్ష్య చేధనతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ఇంకా 11 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేధించింది.