Site icon NTV Telugu

Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్

Natasa Stankovic

Natasa Stankovic

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత ఎక్కువగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. హార్ధిక్ కొంతకాలం క్రితం వరకు లండన్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు.. అతని భార్య నటాషా సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత మోడల్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సమయం గడుపుతుంది. నటాషా తన కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియా వెళ్లింది. ఆ సమయంలోనే హార్దిక్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా.. నటాషా ఇండియాకు తిరిగి వచ్చింది. హార్దిక్‌కి దూరంగా, ఆమె అలెగ్జాండర్‌తో ఉండటం చాలాసార్లు కనిపించింది. వీరిద్దరూ కొన్నిసార్లు జిమ్‌లో, కొన్నిసార్లు స్విమ్మింగ్ పూల్‌లో కలిసి కనిపించారు.

Read Also: Flipkart Big Billion Days: అత్యంత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ S23 FE..

సెక్కా (అలెగ్జాండర్) ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నటాషా స్విమ్మింగ్ ఫూల్‌లో తేలియాడే ఓ బొమ్మపై పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించింది. సెక్కా వెనుక నుంచి వచ్చి నటాషాను కింద పడేశాడు. ఒక్కసారిగా నీళ్లలో పడిపోవడంతో నటాషా షాక్‌కు గురైంది. ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, నటాషా నవ్వుతున్న ఎమోజీలను పంచుకుంది. నటాషా సెక్కాను తన సోదరుడిగా భావిస్తుంది. ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో కూడా చెప్పింది. నటాషా వలె సెక్కా కూడా సెర్బియాకు చెందిన వాడు. అతను ఇండియాలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా, మాల్‌గా పని చేస్తున్నాడు.

Read Also: Stock market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Exit mobile version