ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ నెల 24 న భారత జట్టు తన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడనుంది. అయితే ఈ ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన సమయం నుండి హార్దిక్ పాండ్య పై చర్చలు వస్తూనే ఉన్నాయి. అయితే పాండ్య బౌలింగ్ చేయకపోవడమే ఈ చర్చలకు కారణం. బౌలింగ్ చేయలేని ఆల్ రౌండర్ హత్తులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. అయితే దీని పై తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. పాండ్య బొయిలింగ్ చేయకపోయినా భారత జట్టు పై పెద్ద ప్రభావం ఉండదని కపిల్ అన్నారు. అయితే ఒకవేళ పాండ్య రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అది జట్టుకు చాలా సహాయపడుతుంది.. కానీ బౌలింగ్ చేయకపోతే ఏ ప్రభావం ఉండదు. పాండ్యను ఓ బ్యాటర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అయితే పాండ్య బౌలింగ్ చేయకపోవడం అనేది జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సమస్యల మారవచ్చు అని కపిల్ అన్నారు.