పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ అమీర్ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే గత ఆదివారం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్ లో దాయాదులు మొదటిసారి ఓ ప్రపంచ కప్ టోర్నీలలో ఇండియా పై గెలిచారు. దాంతో అమీర్ ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అందులో హర్భజన్ సింగ్, ఆఫ్రిదికి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియోలో ఆఫ్రిది హర్భజన్ బౌన్గ్ లో వరుస సిక్స్ లు కొట్టాడు. దానికి జవాబుగా హర్భజన్… 2010 ఇంగ్లాండ్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అమీర్ వేసిన నో బాల్స్ వీడియోను పోస్ట్ చేసాడు. అలాగే ప్రజలు నిన్ను ఓ బాదుడు మనిషిగానే చూస్తున్నారు. ప్రజలను ఇలా అవమానించి.. బాదుడు కోసం పాకులాడే నీతో మాట్లాడటం భాధగా ఉంది అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే ఆ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అమీర్ ఫిక్సింగ్ చేసిన విషయం తెలిసిందే.