Harbhajan Singh: అశ్విన్‌ను బీభత్సంగా వాడుకున్నది ఆ జట్టు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో రాజస్థాన్ జట్టు వ్యూహాలను భజ్జీ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను ఉపయోగించుకోని రీతిలో రాజస్థాన్ జట్టు వాడుకుందని హర్భజన్ గుర్తుచేశాడు. అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు ప్రతిఫలంగా ఆ జట్టు ఎంతో మేలు పొందిందని కూడా తెలిపాడు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో బట్లర్‌తో పాటు అశ్విన్‌కు కూడా భాగం ఉందన్నాడు.
RCB: ఇదీ ఆర్సీబీ సత్తా అంటే.. ప్రపంచంలోనే రెండో జట్టుగా రికార్డు
Also Read
- Ind Vs Pak: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. బౌండరీ ఆపే క్రమంలో వైభవ్‌కు గాయం..
- Rachin Ravindra: చివరి రోజు ఆటపై రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. ‘వారే మ్యాచ్‌ను మలుపుతిప్పారు’
- Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
- Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
అశ్విన్ బ్యాటింగ్ ప్రతిభను గుర్తించి రాజస్థాన్ యాజమాన్యం బ్యాటింగ్ ఆర్డర్లో ముందు దించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఫ్రాంచైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అశ్విన్ కూడా రాణించడం శుభపరిణామం అని పేర్కొన్నాడు. అశ్విన్‌ను బీభత్సంగా వాడుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ మాత్రమేనని భజ్జీ స్పష్టం చేశాడు. కాగా అశ్విన్ ఈ సీజన్లో బ్యాటింగ్ విషయంలో 30కి పైగా సగటుతో 183 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లో 9 కంటే తక్కువ ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో అశ్విన్ ఒక సీజన్లో 150కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
-
BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
-
Anirudh : గురువును మర్చిపోయిన రాక్‌స్టార్..అనిరుధ్ రిసెప్షన్‌కు ధనుష్ డుమ్మా?
-
Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం
-
Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!