IPL 2022: తొలి సీజన్‌లోనే ఫైనల్‌కు దూసుకెళ్లిన గుజరాత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ క్రికెట్ అభిమానులకు మంచి మజా అందించింది. ఆడేది తొలి ఐపీఎల్ సీజన్ అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ సాహా డకౌట్ కాగా శుభ్‌మన్ గిల్(35), మాథ్యూ వేడ్(35) రాణించారు.
IPL Qualifier 1: జాస్ బట్లర్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ స్కోరు
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
- Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
- IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
అయితే మూడు వికెట్లు పడిపోవడంతో రాజస్థాన్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే హార్డిక్ పాండ్యా(40 నాటౌట్), మిల్లర్(68 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో లక్ష్యానికి చేరువగా వెళ్లారు. చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా రాజస్థాన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. అయితే అతడు వేసిన తొలి మూడు బంతులను డేవిడ్ మిల్లర్ స్టాండ్స్‌లోకి పంపించడంతో గుజరాత్ ఘనవిజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెకాయ్ చెరో వికెట్ తీశారు. బట్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. లీగ్ దశలో ఎక్కువ విజయాలతో మొదటగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన గుజరాత్ ఫైనల్లోకి కూడా మొదటగానే చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్‌కు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రాజస్థాన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనుంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!