NTV Telugu Site icon

IPL 2023 : గుజరాత్ తో పోటీకి సై అంటున్న సన్ రైజర్స్

Gt Vs Srh

Gt Vs Srh

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి. ఇక నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇంకా మ్యాచ్ లు ఉన్నాయి. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ ఇవాళ సన్ రైజర్స్ తో తమ సొంత మైదానంలో తలపడనుంది. అటు బ్యాటింగ్ లోనూ.. ఇటు బౌలింగ్ లోనూ గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతుంది.

Also Read : Bhagiratha: ‘నాగలాదేవి’ పేరుతో శ్రీకృష్ణదేవరాయలు ప్రేమకథ!

హార్థిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ జైత్రయాత్రకు సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేస్తుందా అనేది వేచి చూడాలి. ఆ టీమ్ ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్ కేవలం నామమాత్రమే.. పోయిన పరువు కాపాడు కోవాలంటే ఈ మ్యాచ్ లోనైనా కనీసం డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ను ఓడించాలి. జట్టు పరంగా చూస్తే గుజరాత్ టైటాన్స్ ను ఓడించేంత సీన్ కనిపించడం లేదు.. ఏది ఏమైనా భారీ ధరకు కొనుగోలు చేసిన ఎస్ ఆర్ హెచ్ సీఈఓ కావ్య మారన్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు.

Also Read : New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త రూల్స్‌.. ఇకపై ఇలా చేయాల్సిందే..

ఇరు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరుగనుంది. గుజరాత్ కు 16 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు 8 మ్యాచ్ ల్లో గెలిచింది. శుబ్ మన్ గిల్, సాహా, పాండ్యా విజయ్ శంకర్ తో పాటు డేవిడ్ మిల్లర్ ఉన్నారు. ఇక హైదరాబాద్ టీమ్ ను చూస్తే అభిషేక్ శర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెస్, గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్ ఏ సమయంలోనైనా చెలరేగే అవకాశం ఉంది.