Gujarat Titans Won The Toss And Chose To Field Against Chennai Super Kings: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పుడు లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇకపై ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు చెన్నై జట్టు రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో.. వాళ్లు నేరుగా ఫైనల్స్‌కి చేరుకున్నారు. ఎవరైతే ఓడిపోతారో, వాళ్లు క్వాలిఫయర్ 2కి వెళ్తారు. ఎలిమినేటర్‌లో ఏ జట్టు గెలుస్తుందో, ఆ జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడాల్సి వస్తుంది.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్ని అమలు చేస్తాం
ఈ సీజన్‌లో జీటీ, సీఎస్కే జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చి.. టాప్-2 స్థానాల్లో నిలిచాయి. అయితే.. జీటీ జట్టు మాత్రం చెన్నై కన్నా ఓ మెట్టు పైనే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జట్టు అదరగొడుతోంది. ముఖ్యంగా.. బ్యాటింగ్ విభాగంలో చాలామంది బ్యాటర్లు ఉన్నారు. ఏడు వికెట్ల దాకా మెరుగ్గా రాణించే బ్యాటర్లు ఆ జట్టుకి సొంతం. అందుకే కదా.. ఈ సీజన్‌లో అత్యధిక విజయాలు సాధించి, 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అటు.. చెన్నై జట్టు కూడా మూడు విభాగాల్లో దుమ్మురేపుతోంది. అద్భుతమైన ఓపెనింగ్ అందించే ఓపెనర్లతో పాటు.. మిడిలార్డర్‌లో పరుగుల వర్షం కురిపించే విధ్వసకర బ్యాటర్లు కూడా ఉన్నారు. ధోనీ రంగంలోకి దిగేదాకా.. ఆ జట్టులో పవర్‌ఫుల్ బ్యాటర్లు ఉన్నారు. అలాగే.. సీఎస్కే బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో బౌలర్లు కాస్త తడబడినా.. ఆ తర్వాత ధోనీ ఇచ్చిన స్వీట్ వార్నింగ్‌తో అందరూ గాడిలోకి వచ్చారు. అప్పటినుంచి సీఎస్కే విజయాల పర్వం కొనసాగించడం మొదలుపెట్టింది.
UPSC CSE 2022: సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
కాకపోతే.. జీటీ, చెన్నై జట్ల మధ్య జరిగిన పోటీల్లో గుజరాత్ టైటాన్స్‌దే గత మూడు మ్యాచ్‌ల్లో చెన్నై జట్టుని గుజరాత్ చిత్తుచిత్తుగా ఓడించి, ఆ జట్టుపై తన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇతర జట్లపై పంజా విసరడంలో సక్సెస్‌ఫుల్ అవుతున్న సీఎస్కే.. ఎందుకో జీటీ ముందు మాత్రం చిన్నబోతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో జీటీ చేతుల్లో ఘోర పరాజయాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే.. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీటీ మరోసారి తన ఆధిపత్యం చెలాయించి చెన్నైని ఓడిస్తుందా? లేకపోతే చెన్నై ఈసారి జీటీకి గట్టి కౌంటర్ ఇచ్చి విజయం సాధిస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
