Gujarat Titans Won By Six Wickets Against Punjab Kings: మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఇంకో బంతి మిగిలి ఉండగానే ఛేధించింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 67) అర్థశతకంతో రాణించడంతో పాటు మొదట్లో సాహా (30) మెరుపులు మెరిపించడంతో.. గుజరాత్ ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకోగలిగింది. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడం వల్ల.. గుజరాత్ జట్టు చివరివరకు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. చివర్లో వాతావరణం కాస్త టెన్షన్‌గా మారినా.. గుజరాత్‌వైపే విజయాకాశాలు ఉండటంతో మరీ ఉత్కంఠభరితంగా అనిపించలేదు. మొదటినుంచి గుజరాత్ కనబర్చిన ఆటతీరు చూసి.. ఆ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేధిస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. అదే గుజరాత్ చేసి చూపించింది కూడా!
Bhatti Vikramarka : దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పరిపాలన
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడం వల్ల.. పంజాబ్ ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మాథ్యూ షార్ట్ ఒక్కడే 36 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లు తమవంతు సహకారం అందించడం, చివర్లో షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22) కాస్త మెరుపులు మెరిపించడంతో.. పంజాబ్ జట్టు 150 పరుగుల మైలురాయిని దాటగలిగింది. ఇక 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. మొదట్లో మెరుపులు మెరిపించింది. ఓపెనర్లు శుభ్మన్, సాహా కలిసి కాసేపు పరుగుల వర్షం కురిపించారు. సాహా ఔటయ్యాక గుజరాత్ జోరు నమ్మదించింది. లక్ష్యం కూడా చిన్నదే కావడంతో.. గుజరాత్ ఆటగాళ్లూ నిదానంగానే ఆడుతూ వచ్చారు. ఈ క్రమంలో శుభ్మన్ తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చివర్లో రాహుల్ తెవాతియా విన్నింగ్ షాట్‌తో గుజరాత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో మొత్తం మూడు విజయాలు సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
GT vs PBKS: లక్ష్యంవైపు దూసుకెళ్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!