NTV Telugu Site icon

GT vs MI: ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

Gujarat Titans Won

Gujarat Titans Won

Gujarat Titans Won By 55 Runs On Mumbai Indians: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో గుజరాత్ 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముంబైలోని ప్రధాన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలం అవ్వడంతో, ఆ జట్టు ఇంత చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొంతలో కొంత నేహాల్ వాధేరా (40), గ్రీన్ (33) పర్వాలేదనిపించారంతే. మిగతా వాళ్లు ఘోర ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ పలు షాట్లతో ఊరించాడు కానీ, ఆ తర్వాత ఉసూరుమనిపించాడు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (56) అర్థశతకంతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో రాహుల్ తెవాతియా కేమియో కూడా అదిరింది. అతడు కేవలం 5 బంతుల్లోనే మూడు సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు సైతం తమవంతు సహకారం అందించడంతో.. గుజరాత్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. ఆది నుంచే చెత్త ప్రదర్శన కనబర్చింది. పవర్ ప్లేలో దుమ్మరేపుతారని అనుకున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్.. టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి బంతులు వృధా చేశారు. రోహిత్ 8 బంతులు ఆడి 2 పరుగులే చేస్తే.. ఇషాన్ కిషన్ 21 బంతులు ఆడి 13 పరుగులే చేశాడు. టాపార్డర్‌లో కెమెరాన్ గ్రీన్ (33) ఒక్కడే అప్పుడప్పుడు మంచి షాట్లు ఆడుతూ.. జట్టుని ముందుకు నడిపించాడు.

Joe Biden: 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. జో బైడెన్ ప్రకటన

ఇక గ్రీన్ కుదురుకున్నాడని, ఈరోజు భారీ ఇన్నింగ్స్ చూడబోతున్నామని అనుకునేలోపే అతడు ఔటయ్యాడు. ఈసారి యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా రెండు పరుగులకే చేతులెత్తేశాడు. టిమ్ డేవిడ్ అయితే.. ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాడంతే! అప్పుడు క్రీజులో ఉన్న సూర్య, నేహాల్ కాస్త మెరుపులు మెరిపించడం చూసి.. బహుశా వీళ్లు గట్టిగా ప్రయత్నిస్తారేమోనని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే సూర్య ఔట్ అవ్వడంతో ఆశలన్నీ బోల్తా పడ్డాయి. నేహాల్ (40) ఉన్నంతసేపు కాస్త మెరుపులు మెరిపించాడు. ఇక మిగతా బ్యాటర్లు సోసోగా రాణించి.. ఆలౌట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.