Site icon NTV Telugu

GT vs KXIP 11 Prediction: గుజరాత్,పంజాబ్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

GT vs KXIP Captain and Vice-Captain Choices: ఐపీఎల్‌ 2024లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న పంజాబ్ .. గుజరాత్ పైన ఎలా అయినా సరే గెలవాలని చూస్తోంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్స్ లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి , ఒకటి ఓటమి పలయింది. అయితే గుజరాత్ తన హోమ్ గ్రౌండ్ లో ఆడటంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది.

Also Read; Rishabh Pant: ఏది కలిసి రాలేదు.. మా ఓటమికి కారణం అదే: పంత్

ఇక పిచ్ విషయానికి వస్తే బేటర్స్ కి అనుకూలంగా ఉంటుందని టాస్ గెలిస్తే మొదట బాటింగ్ చేయడం ఉత్తమం అని లక్ష్యా ఛేదనలో డ్యూ ఫేక్టర్ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత సీజన్‌లో పంజాబ్ తో పోలిస్తే గుజరాత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఆలా అని పంజాబ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు ఓపెనింగ్ బాటింగ్ లో బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ కనుపరచకపోవడంతో లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ ఓటమి పాలయింది. ఇక ఈ మ్యాచ్ లో “లియామ్ లివింగ్‌స్టోన్” గాయం కారణంగా ఉండకపోవచ్చు అని క్రిక్ బజ్ సమాచారం.

తుది జట్లు (అంచనా):
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా (వికె), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే [ఇంపాక్ట్ సబ్: మోహిత్ శర్మ]

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (WK), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్పీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్ [ఇంపాక్ట్ సబ్: అర్ష్‌దీప్ సింగ్]

డ్రీమ్ 11 టీమ్:
కీపర్ – వృద్ధిమాన్ సాహా, జితేష్ శర్మ
బ్యాట్స్‌మెన్ – శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సాయి సుదర్శన్
ఆల్ రౌండర్లు – అజ్మతుల్లా ఒమర్జాయ్, సామ్ కర్రాన్,
బౌలర్లు – కగిసో రబడ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

 

Exit mobile version