Site icon NTV Telugu

GT vs MI: పీకల్లోతు కష్టాల్లో గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Gt 10 Overs

Gt 10 Overs

Gujarat Titans Scored 82 Runs In First 10 Overs Against MI: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు ఏకంగా 5 వికెట్లు కోల్పోయి, 82 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 137 పరుగులు చేయాలి. అంటే.. ఓవర్‌కి 14 రన్ రేట్‌తో పరుగులు బాదాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీ లక్ష్యాన్ని జీటీ ఛేధించడమనేది.. కత్తిమీద సాము వంటిది. ప్రస్తుతం క్రీజులో ఉన్న తేవాతియా, డేవిడ్ మిల్లర్లు మాత్రమే భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. కాకపోతే.. వీళ్లు చివరివరకు రాణించగలరా? అనేది అతిపెద్ద ప్రశ్న. భారీ ఇన్నింగ్స్ ఆడగల బ్యాటర్లు ఇంకెవరూ లేరు కాబట్టి.. వీళ్లిద్దరే చివరివరకు నెట్టుకురావాల్సి ఉంటుంది.

Off The Record: గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మధ్య కయ్యాలు..!

నిజానికి.. జీటీ టాపార్డర్ అద్భుతంగా ఉంది కాబట్టి, పవర్ ప్లేలో బౌండరీల మోత మోగిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా జీటీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలుత సాహా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. హార్దిక్ ఆ వెంటనే క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన విజయ్ శంకర్ కాసేపు మెరుపులు మెరిపించాడు. ఏకంగా ఆరు ఫోర్లు బాదాడు. జేసన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. అతని దూకుడు చూసి.. జట్టుని లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తాడని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పియూష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభివన్ మనోహర్ కూడా కార్తికేయ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. థర్డ్ డౌన్‌లో వచ్చిన డేవిడ్ మిల్లర్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. తేవాతియా కూడా అతనికి మద్దతు ఇస్తున్నాడు. మరి.. జీటీ ఎంతమేర రాణిస్తుందో చూడాలి.

Bandla Ganesh: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి బండ్లన్న రీ ఎంట్రీ.. ఏ పార్టీలో..?

Exit mobile version