Site icon NTV Telugu

DC vs GT: చెమటోడుస్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Gt 10 Overs

Gt 10 Overs

Gujarat Titans Scored 49 In First 10 Overs: ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. లక్ష్యాన్ని ఛేధించేందుకు చెమటోడుస్తోంది. తొలి పది 10 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం కేవలం 49 పరుగులే చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. 60 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంటుంది. గుజరాత్ జట్టు ఇప్పటికే 4 కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి.. ఆ లక్ష్యాన్ని ఛేధించడమన్నది కాస్త కష్టమే. ఢిల్లీ బౌలర్లు కూడా రేపన్నది లేదన్నట్టుగా అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నారు కాబట్టి.. చాలా జాగ్రత్తగా రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ కాస్త తేడా కొట్టినా.. గుజరాత్ నుంచి ఈ మ్యాచ్ చేజారినట్టే అవుతుంది.

Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 నగరాలు

నిజానికి.. స్వల్ప లక్ష్యంతో గుజరాత్ బరిలోకి దిగడంతో, ఇది వన్‌సైడ్ మ్యాచ్‌గా ముగుస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. ఆడుతూ పాడుతూ సునాయాసంగా ఈ చిన్న లక్ష్యాన్ని గుజరాత్ జట్టు ఛేధిస్తుందని భావించారు. ఈ సీజన్‌లో భారీ లక్ష్యాన్ని ఛేధించిన ట్రాక్ రికార్డ్ గుజరాత్‌కి ఉంది కాబట్టి, ఈ చిన్న లక్ష్యం ఆ జట్టుకి జూజూబీనే అని అభిప్రాయపడ్డారు. కానీ.. ఢిల్లీ బౌలర్లు ఆ అంచనాల్ని తిప్పేశారు. సూపర్‌గా బౌలింగ్ వేస్తూ.. గుజరాత్ బ్యాటర్లనే రివర్స్‌లో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ.. పరుగులు ఇవ్వకుండా, కీలక వికెట్లు పడగొడుతూ వస్తున్నారు. తొలి ఓవర్‌ని ఖలీల్ అహ్మద్ మెయిడెన్ ఓవర్‌గా ముగించడంతోనే.. ఈ కాంపిటీషన్ చాలా టఫ్‌గా ఉండబోతుందన్న ఉద్దేశాలు ఏర్పడ్డాయి.

Ukraine War: “చెర్నోబిల్” వద్ద రేడియేషన్ బారిన పడిన రష్యా సైనికులు..

ఇక గుజరాత్‌కి అత్యంత విలువైన ప్లేయర్‌గా మారిన శుభ్మన్ గిల్ సైతం 6 పరుగులకే వెనుదిరగడంతో షాక్ తగిలినట్టయ్యింది. అతని తర్వాత వచ్చిన విజయ్ శంకర్ కూడా 6 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక ‘కిల్లర్ బ్యాటర్’గా పేరొందిన మిల్లర్ అయితే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ హార్దిక్ ఒక్కడే ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం హార్దిక్‌తో పాటు క్రీజులో అభినవ్ మనోహర్ ఉన్నాడు. వన్‌సైడ్ అవుతుందన్న మ్యాచ్ ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారడంతో.. ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Exit mobile version