Site icon NTV Telugu

GT vs LSG: జీటీ పరుగుల సునామీ.. 10 ఓవర్లలో రికార్డ్ స్కోరు

Gt 10 Overs Score

Gt 10 Overs Score

Gujarat Titans Scored 121 In First 10 Overs: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు పరుగుల సునామీ సృష్టిస్తోంది. లక్నో బౌలర్లపై గుజరాత్ బ్యాటర్లు విలయతాండవం చేస్తున్నారు. ఎడాపెడా షాట్లతో మైదానంలో బౌండరీల మోత మోగించేస్తున్నారు. ఫలితంగా.. తొలి 10 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా గుజరాత్ టైటాన్స్ 121 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున ఓపెనింగ్ చేసిన వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా.. సాహా తాండవం చేయడం స్టార్ట్ చేశాడు. కేవలం 20 బంతుల్లోనే అతడు అర్థశతకం పూర్తి చేసుకున్నాడంటే.. ఏ రేంజ్‌లో సాహా విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక హాఫ్ సెంచరీ చేశాక అతడు మరింత చెలరేగి ఆడుతున్నాడు.

Rohit Sharma: ‘రోహిత్’ కాదు.. ‘నోహిట్’ శర్మగా పేరు మార్చుకో..

సాహా అర్థశతకం చేసుకున్న తర్వాత శుభ్మన్ గిల్ కూడా ఖాతా తెరిచాడు. అప్పటివరకూ నిదానంగా ఆడుతూ, సాహా ఆడేందుకు ఎక్కువ అవకాశం ఇచ్చిన అతగాడు.. ఆ తర్వాతి నుంచి తానూ ఏం తక్కువ తినలేదన్నట్టుగా విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టాడు. ఇలా సాహా, శుభ్మన్ గిల్ విరుచుకుపడటంతో.. గుజరాత్ స్కోరు జెట్ స్పీడ్‌లా పరుగులు పెడుతోంది. వీరి దూకుడు చూస్తుంటే.. ఈరోజు గుజరాత్ జట్టు రికార్డ్ స్కోరు నమోదు చేసేలా కనిపిస్తోంది. లక్నో బౌలర్ల విషయానికొస్తే.. ఎవ్వరూ గుజరాత్ ఓపెనర్లను కట్టడి చేయలేకపోయారు. ప్రతిఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. కాస్తో కూస్తో స్వప్నిల్ పర్వాలేదంతే. మిగతా వాళ్లు మాత్రం స్కోరు కొట్టుకోండి అన్నట్టుగా.. బంతులు అందిస్తున్నారు. తద్వారా గుజరాత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చితక్కొడుతున్నారు.

Islamabad Meeting: ఇస్లామాబాద్ సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం

Exit mobile version