GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..
- ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్ సూపర్ విక్టరీ
- జురెల్, జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్
- బిష్ణోయ్ స్పిన్‌తో మ్యాచ్ టర్న్
- చివరి ఓవర్లో దేశ్‌పాండే హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీతో శుభారంభం ఇవ్వగా, ధ్రువ్ జురెల్ 42 బంతుల్లోనే 75 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా మెరుపులతో రాజస్థాన్ తన స్కోరును 200 దాటించింది. గుజరాత్ బౌలర్లలో అశోక్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, మహమ్మద్ సిరాజ్ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది.
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్ , కుమార్ కుశాగ్ర మంచి పునాది వేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, మిడిల్ ఓవర్లలో రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. బిష్ణోయ్ ఒకే ఓవర్లో రాహుల్ తెవాటియా , గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. చివర్లో రషీద్ ఖాన్ (24) , కగిసో రబాడ (23) పోరాడినప్పటికీ, రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణ ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి గుజరాత్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.
Also Read
- Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ పరాగ్ బంతిని తుషార్ దేశ్‌పాండేకు అప్పగించాడు. దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన రషీద్ ఖాన్, ఆర్చర్ చేతికి చిక్కి అవుట్ కావడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన తరుణంలో దేశ్‌పాండే వేసిన ఫుల్ టాస్‌ను అశోక్ శర్మ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అద్భుత స్పెల్ వేసిన రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!