NTV Telugu Site icon

IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. ఒక్క వికెట్ నష్టపోకుండా విక్టరీ

Ind Vs Zim

Ind Vs Zim

జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని 3-1తో కైవసం చేసుకుంది. హరారేలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా అత్యధికంగా 46 పరుగులు చేశాడు.

READ MORE: World Skydiving Day: 12 వేల మీటర్ల ఎత్తు నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్కైడైవింగ్..

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఎంతో శ్రమించి 153 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ ఆటగాళ్లు ఆ స్కోర్ ను చేధించారు. ఓపెనింగ్ జోడి శుభ్‌మన్ గిల్, జైస్వాల్ ఆటను ముగించారు. గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు (58 నాటౌట్) బాదాడు. యశస్వి జైస్వాల్ (93 నాటౌట్) ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఇరగ్గొట్టాడు. ఛేదనలో ఈ జోడి తడబడ్డ సందర్భమే కనిపించలేదు. వీరిద్దరిని ఆతిథ్య జట్టు ఆడ్డుకోలేకపోయింది. 150 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించి.. భారత యువ కెరటాల సత్తాచాటారు.

READ MORE: World Skydiving Day: 12 వేల మీటర్ల ఎత్తు నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్కైడైవింగ్..

బౌలర్లు శివమ్ దూబే మరియు అభిషేక్ శర్మల అద్భుత ప్రదర్శన కారణంగా జింబాబ్వే 152 పరుగులకే పరిమితం అయ్యింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారత ఐదో బౌలర్ అభిషేక్ (20/1), ఆరో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దూబే (11/1) చక్కటి బౌలింగ్‌తో జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ వెస్లీ మాధవెరె (24 బంతుల్లో 25 పరుగులు), తాడివనాషే మారుమణి (31 బంతుల్లో 32 పరుగులు)లను అవుట్ చేయడం ద్వారా అతను మిడిల్ ఓవర్లను నియంత్రించాడు. అయితే కెప్టెన్ రజా తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది జింబాబ్వేను 150 పరుగులకు పైగా స్కోరుకు తీసుకెళ్లాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మినహా భారత బౌలర్లందరికీ వికెట్లు దక్కాయి.