Common Wealth Games 2022: కాంస్యం సాధించిన సత్యన్‌.. టేబుల్‌టెన్నిస్ సింగిల్స్‌లో విజయం

Gnanasekaran Sathiyan

Gnanasekaran Sathiyan

Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత టేబుల్ టెన్నిస్ సంచలనం సత్యన్ జ్ఞానశేఖరన్‌కు ఈ కామన్వెల్త్ గేమ్స్ గుర్తుండిపోతుంది. టేబుల్‌ టెన్నిస్ సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని సాధించాడు. పతక నిర్ణయాత్మక గేమ్‌లో సత్యన్ ఇంగ్లండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి కాంస్యాన్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో పాల్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది సత్యన్‌కు మూడో పతకం.

Common Wealth Games 2022: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. లక్ష్యాన్ని ఛేదించిన లక్ష్యసేన్‌

×
×
Ad

అతను గతంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల జట్టులో భాగంగా ఉన్నాడు. అతను తన భాగస్వామి వెటరన్ భారత పాడ్లర్ శరత్ కమల్‌తో కలిసి పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఈ పతకంతో భారత ఖాతాలో 58 పతకాలు (20 స్వర్ణాలు, 15 రజతాలు, 23 కాంస్యాలు) ఉన్నాయి. అంతకుముందు బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.