Gautham Gambhir: మయాంక్ ఇలా అయితే జట్టులో చోటు కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు దొరకడమే ప్రశ్నార్థకంగా మారింది. ఓపెనర్ల లిస్టులో రోహిత్, కేఎల్ రాహుల్, ధావన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులు అందుబాటులో ఉండటంతో మయాంక్‌కు చోటు దక్కడం కష్టతరంగా ఉంది. అయితే టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరంగా ఉండటంతో శ్రీలంకతో తొలి టెస్టుకు మయాంక్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అతడు కేవలం 33 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.
మయాంక్ ఇలానే ఆడితే టెస్టు టీంలో అతడిని కొనసాగించడం కష్టమని గంభీర్ జోస్యం చెప్పాడు. ఏదో ఆడాం అన్నట్లుగా ప్రదర్శన చేస్తే జట్టులో అతడి స్థానం సెక్యూర్‌గా ఉండదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. లసిత్ ఎంబుల్డేనియా, లహిరు కుమార సహా శ్రీలంక బౌలర్లు మయాంక్‌ను ఇబ్బందిపెట్టారని… ప్రత్యేకించి ఇన్నింగ్స్ ఆరంభంలో మయాంక్ చాలా అసౌకర్యంగా కనిపించాడని గంభీర్ అన్నాడు. కేఎల్ రాహుల్ తిరిగొస్తే మయాంక్ స్థానానికి గ్యారంటీ ఉండదనే అనుకుంటున్నానని చెప్పాడు. మయాంక్ చేయాల్సింది వీలైనంత వరకూ భారీ స్కోరు నమోదు చేయడమే అంటూ గంభీర్ మ్యాచ్ మధ్యలో ఓ టీవీ షోలో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించాడు.
Also Read
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
- Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
తాజావార్తలు
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!