NTV Telugu Site icon

అది భారత క్రికెట్ కు చాలా మంచింది…

బీసీసీఐ భారత జట్టు ఇద్దరు కెప్టెన్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వన్డే కెప్టెన్సీ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ కు మాత్రం విరాట్ కోహ్లీనే కొనసాగిస్తోంది. దాంతో ఈ నిర్ణయం మీద బీసీసీఐపై చాలా విమర్శలు రాగ.. కొంత మంది ప్రశంసించారు. ఇక తాజాగా ఈ నిర్ణయం పై భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ఈ నిర్ణయం భారత జట్టుకు మంచిదే అని అన్నారు. రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్ గా రాణిస్తాను అని చెప్పారు.

టీం ఇండియాకు రెడ్ బాల్ క్రికెట్‌లో ఒకరు… వైట్ బాల్ క్రికెట్‌లో ఒకరు కెప్టెన్ గా ఉండటం మంచిదే. దీంతో జట్లను ఆ ఫార్మాట్ లలో తీర్చిదిద్దడానికి కెప్టెన్ లకు తగినంత సమయం లభిస్తుంది అని తెలిపారు. అయితే రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యధికంగా 5 టైటిల్స్ ను సాధించిందంటే.. అతను మిగితా కెప్టెన్స్ కంటే కొత్తగా ఏదో చేస్తున్నాడు అని గంభీర్ అన్నారు. అలాగే ఒక కెప్టెన్ గా రోహిత్ బాగా రాణిస్తాడని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.