ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై భారత్‌కు రెండు వైట్‌వాష్ పరాభవాలు ఎదురయ్యాయి. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. ఏడాది తిరిగాక అదే నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2తో వైట్ వాష్‌కు గురైంది. సఫారీలతో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడడం మాత్రం దారుణం అనే చెప్పాలి. 12 ఏళ్ల పాటు సొంతగడ్డపై ఒక్క సిరీస్ ఓడిపోని టీమిండియా.. ఏడాది వ్యవధిలో రెండు సిరీస్‌ల్లో వైట్ వాష్‌కు గురి కావడం మామూలు విషయం కాదు.
వైట్ వాష్‌కు గురైన సమయంలో ప్రతి ఒక్కరు కెప్టెన్, ఆటగాళ్లను నిందిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. న్యూజిలాండ్ పరాభవం అనంతరం ముగ్గురు దిగ్గజ ప్లేయర్స్ తమ కెరీర్లకు ముగింపు పలికారు. ముందుగా సొంతగడ్డపై ఎన్నో సిరీస్ విజయాలు అందించిన లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు ఆల్విదా చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో యాష్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అశ్విన్‌ను గంభీర్ సైడ్ చేశాడని అందరూ అన్నారు.
న్యూజిలాండ్ టెస్ట్ పరాభవం స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూడా ఒత్తిడిలో పడేసింది. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా ఈ దిగ్గజాలు రాణించలేదు. విమర్శలు వచ్చినా.. ఇద్దరూ రిటైరవ్వాలని అనుకోలేదు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు రో-కోలు సిద్ధంగానే ఉన్నారు. బాగానే ప్రాక్టీస్ కూడా చేశారు. సిరీస్‌కు కొన్ని వారాల ముందు అనూహ్యంగా రోహిత్, కోహ్లీలు గుడ్ బై చెప్పేశారు. ముందుగా రోహిత్ ఆల్విదా చెప్పగా.. కోహ్లీ ఆడుతాడని అందరూ అనుకున్నారు. టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అని ఎప్పుడూ చెప్పే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. రో-కోలను పొమ్మనకుండా పొగబెట్టింది కోచ్ గౌతమ్ గంభీరే అనే ఆరోపణలు వచ్చాయి. గంభీరే ముగ్గురు దిగ్గజ ఆటగాళ్ల నిష్క్రమణకు కారణమయ్యాడు.
Also Read: Celina Jaitly: వేరే వ్యక్తితో పడుకోవాలని.. నగ్న ఫోటోలతో నా భర్త బ్లాక్ మెయిల్ చేశాడు: బాలీవుడ్ నటి
గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక భారత్ ఖాతాలో వరుస సిరీస్ ఓటములు చేరాయి. న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ ఓటములు గంభీర్ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్ వాష్‌కు గురైంది. గ్యారీ కిర్‌స్టన్ హయాం నుంచి ఇన్ని ఓటములు ఏ కోచ్ ఖాతాలో లేవు. అంతేకాదు గంభీర్ హయాంలో సెలక్షన్ నిర్ణయాలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఫేమ్, ఫామ్ చూడకుండా.. ఇష్టమొచ్చిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాడు. ప్లేయింగ్ 11లో కూడా ఓ ఆటగాడికి నిర్దిష్ట స్థానం లేకపోయింది. ఈ నేపథ్యంలో గంభీర్‌పై వేటు పడాలని ఫాన్స్, నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
