NTV Telugu Site icon

AUS vs IND: సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడేది కష్టమే?: కోచ్ గౌతమ్ గంభీర్

Rohit

Rohit

AUS vs IND: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక, అతడిని తుది జట్టులో కొనసాగించవొద్దనే డిమాండ్లూ పెరిగాయి. దీంతో సిడ్నీ వేదికగా రేపటి (జనవరి 2) నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వీటికి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్ మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. మ్యాచ్‌ సమయానికే తుది జట్టును ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. రోహిత్‌తో సమస్యేమీ లేదన్నట్లుగా అతడు మాట్లాడాడు.

Read Also: Police Constable: కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కానీ, దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి.. జట్టులో ఏం మాట్లాడుకుంటున్నాం అనేది బయటకు రానీయకుండా చూసుకోవాలని టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఇక, కెప్టెన్ రోహిత్‌ శర్మతో నాకు ఇబ్బందేం లేదు.. ఫైనల్ XI మందిని మ్యాచ్‌కు ముందే ప్రకటిస్తామన్నారు. పిచ్‌ పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం.. సిడ్నీ టెస్టులో ఎలా విజయం సాధించాలనేది ప్రతి ఒక్కరం చర్చించాం.. ఈ టెస్టు మాకు అత్యంత కీలకం అని కోచ్ గంభీర్‌ చెప్పారు. ఇక, ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ శర్మ గైర్హజరిపై గంభీర్‌కు ప్రశ్న ఎదురవగా.. దానికి ఆన్సర్ ఇస్తూ.. ఇది సంప్రదాయమని తాము అనుకోవడం లేదు. హెడ్‌కోచ్‌గా నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చా.. అది సరిపోతుందనుకుంటా.. ఇక, బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని తాము సమం చేస్తామని గంభీర్ వెల్లడించారు.

Show comments