NTV Telugu Site icon

Commonwealth Games 2022: నేటితో ముగియనున్న కామన్వెల్త్ క్రీడలు.. భారత్‌ షెడ్యూల్‌ ఇదే..

Commonwealth

Commonwealth

కామన్‌వెల్త్ గేమ్స్‌ చివరిదశకు చేరుకున్నాయి.. ఇవాళ్టితో ముగియబోతున్నాయి.. అయితే, భారత ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు.. కామన్వెల్త్‌లో ఇప్పటికే 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది భారత్… ఇక, కామన్వెల్త్ గేమ్స్ 2022, 11వ రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ ఓసారి పరిశీలిస్తే.. కామన్వెల్త్ క్రీడల చివరి రోజున పీవీ సింధు మరియు లక్ష్య సేన్ వంటి స్టార్‌ అథ్లెట్స్.. స్వర్ణ పతకం కోసం పోటీ పడనున్నారు.. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున, భారత షట్లర్లు పీవీ సింధు మరియు లక్ష్య సేన్ సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ కోసం మ్యాచ్‌లు ఆడనున్నారు.. పురుషుల హాకీ జట్టు కూడా ఆస్ట్రేలియాతో స్వర్ణ పతక పోరులో తలపడుతుంది, ఈవెంట్ చివరి రోజున భారత్ మంచి ముగింపు కోసం చూస్తుంది. భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కూడా తన స్వర్ణ పతక మ్యాచ్‌ను ఆడనున్నాడు.

Read Also: Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్‌..

కామన్వెల్త్ గేమ్స్‌లో 11వ రోజు భారత్‌ పూర్తి షెడ్యూల్:
* బ్యాడ్మింటన్:
– మధ్యాహ్నం 1:20 గంటలకు మహిళల సింగిల్స్ ఫైనల్ (పీవీ సింధు)
– మధ్యాహ్నం 2.10 గంటలకు పురుషుల సింగిల్స్ ఫైనల్ (లక్ష్య సేన్)
– మధ్యాహ్నం 3 గంటలకు పురుషుల డబుల్స్ ఫైనల్ (చిరాగ్ శెట్టి/సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి)

* టేబుల్ టెన్నిస్

– మధ్యాహ్నం 3:35 గంటలకు పురుషుల కాంస్య పతక మ్యాచ్ (సతియన్ జీ),
– సాయంత్రం 4.25 గంటలకు పురుషుల బంగారు పతకం (శరత్ కమల్)
* హాకీ
– సాయంత్రం 5 గంటలకు పురుషుల హాకీలో భారత్ vs ఆస్ట్రేలియా మధ్య ఫైనల్