Commonwealth Games 2022: నేటితో ముగియనున్న కామన్వెల్త్ క్రీడలు.. భారత్ షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్‌వెల్త్ గేమ్స్ చివరిదశకు చేరుకున్నాయి.. ఇవాళ్టితో ముగియబోతున్నాయి.. అయితే, భారత ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు.. కామన్వెల్త్‌లో ఇప్పటికే 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది భారత్… ఇక, కామన్వెల్త్ గేమ్స్ 2022, 11వ రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఓసారి పరిశీలిస్తే.. కామన్వెల్త్ క్రీడల చివరి రోజున పీవీ సింధు మరియు లక్ష్య సేన్ వంటి స్టార్ అథ్లెట్స్.. స్వర్ణ పతకం కోసం పోటీ పడనున్నారు.. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున, భారత షట్లర్లు పీవీ సింధు మరియు లక్ష్య సేన్ సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కోసం మ్యాచ్‌లు ఆడనున్నారు.. పురుషుల హాకీ జట్టు కూడా ఆస్ట్రేలియాతో స్వర్ణ పతక పోరులో తలపడుతుంది, ఈవెంట్ చివరి రోజున భారత్ మంచి ముగింపు కోసం చూస్తుంది. భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కూడా తన స్వర్ణ పతక మ్యాచ్‌ను ఆడనున్నాడు.
Read Also: Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్.. 10 మంది శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్..
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
- Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
కామన్వెల్త్ గేమ్స్‌లో 11వ రోజు భారత్ పూర్తి షెడ్యూల్:
* బ్యాడ్మింటన్:
– మధ్యాహ్నం 1:20 గంటలకు మహిళల సింగిల్స్ ఫైనల్ (పీవీ సింధు)
– మధ్యాహ్నం 2.10 గంటలకు పురుషుల సింగిల్స్ ఫైనల్ (లక్ష్య సేన్)
– మధ్యాహ్నం 3 గంటలకు పురుషుల డబుల్స్ ఫైనల్ (చిరాగ్ శెట్టి/సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి)
* టేబుల్ టెన్నిస్
– మధ్యాహ్నం 3:35 గంటలకు పురుషుల కాంస్య పతక మ్యాచ్ (సతియన్ జీ),
– సాయంత్రం 4.25 గంటలకు పురుషుల బంగారు పతకం (శరత్ కమల్)
* హాకీ
– సాయంత్రం 5 గంటలకు పురుషుల హాకీలో భారత్ vs ఆస్ట్రేలియా మధ్య ఫైనల్
తాజావార్తలు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?