IPL Mega Auction: తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే.. ధర రూ.5-15 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం.
ఈ జాబితాలో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్, డుప్లెసిస్, రబాడ, ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, డికాక్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరి కనీస ధర రూ.2 కోట్లు. అయితే వీరికి రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఫ్రాంచైజీలు కుమ్మరించనున్నాయి. ఆయా ఆటగాళ్ల దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమ జట్లకు ఆడిన ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. రిటైన్ పక్రియలో అవకాశం లేకపోవడంతో వాళ్లను తీసుకోలేకపోయామని.. వేలంలో కచ్చితంగా వాళ్లను సొంతం చేసుకుంటామని ఆయా ఫ్రాంచైజీలు చెప్తున్నాయి. ఈ మేరకు ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, డుప్లెసిస్‌ను చెన్నై సూపర్‌కింగ్స్, డికాక్‌ను ముంబై ఇండియన్స్ జట్లు సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!