Ind vs Wi: వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ పైన కూడా కన్నేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 తేడా భారత్ ముందంజలో ఉంది. ఇవాళ జరగనున్న నాలుగో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ భారత్ వశం కానుంది. ఇవాళ్టి టీ20 మ్యాచ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రెండూ గెలిస్తేనే టీ20 సిరీస్ దక్కుతుంది. లేదంటే వన్డే సిరీస్‌ను అప్పగించినట్లే టీ20 సిరీస్‌ను భారత్ చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్.. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
విండీస్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఎక్కువగా టీ20లే ఆడుతోంది. టీ20 వరల్డ్‌కప్ బెర్త్ దక్కాలంటే దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లు మెరుపులు మెరిపించాల్సిందే. కాబట్టి ఇకపై వీళ్లకి ప్రతీ మ్యాచ్ కూడా ఫైనల్ పరీక్షలాంటిదే. రెండు రోజుల్లో రెండూ గెలవాల్సిన ఒత్తిడిలో వెస్టిండీస్ ఉంది. రెండో టి20లో బౌలింగ్‌తో బెదరగొట్టిన కరీబియన్ బౌలర్లు గత మ్యాచ్‌లో తేలిపోయారు. తనకు అందిన చాలా అవకాశాలను ఉపయోగించుకున్న దీపక్ హుడా, పెద్ద టిక్కెట్ టీ20 ప్రపంచకప్ బెర్త్ విషయానికొస్తే, ప్రస్తుతం అయ్యర్‌ను అధిగమించడం విశేషం.
వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్‌లో కనీసం పోటీ ఇవ్వలేకపోయినా ఆ జట్టు టీ20 సిరీస్‌లో మాత్రం పోటీనిస్తోంది. రెండో మ్యాచ్‌లో భారత్‌కు షాక్‌ను ఇచ్చింది. మూడో టీ20లోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఐతే భారత ఓపెన్ సూర్యకుమార్ షో ముందు ఆ జట్టు బౌలింగ్ నిలవలేకపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విండీస్ జట్టు గెలిస్తే సిరీస్ దక్కనుంది.
Common Wealth Games 2022: రెజ్లింగ్‌లో పతకాల జోరు.. పసిడి పట్టు పట్టిన రెజ్లర్లు
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్ర అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.
వెస్టిండీస్ జట్టు: కింగ్, మయర్స్, పూరన్(కెప్టెన్), హెట్‌మయిర్, థామస్, పావెల్, డ్రాక్స్, హోల్డర్, హోసెన్, జోసెఫ్, మెకాయ్.
