Virat Kohli: కోహ్లీకి కోపం వస్తుంది.. క్రికెట్ బోరింగ్‌గా మారిపోతుంది.. మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Chaudhary About Virat Kohli Attitude: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో దూకుడుగా కనిపించినా.. అతని మనసులో ఎలాంటి ద్వేషం ఉండదని మాజీ అంపైర్ అనిల్ చౌదరి తెలిపారు. ఆట పట్ల చూపే అంకితభావం, గెలుపుపై ఉన్న తపన వల్లే కొన్నిసార్లు కోహ్లీ ఆగ్రహంగా స్పందిస్తాడని చెప్పారు. కింగ్ లాంటి ఆటగాళ్లు క్రికెట్‌కు అవసరమని, వారే ఆటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తారని అనిల్ చౌదరి అభిప్రాయపడ్డారు. జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ అనిల్ చౌదరి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి ఆడిన మ్యాచ్‌లకు నేను అంపైరింగ్ చేశాను. అందుకే అతని స్వభావం నాకు బాగా తెలుసు. అతనిలో ఎలాంటి దురుద్దేశం ఉండదు. కొన్నిసార్లు ఆవేశంగా స్పందించినా.. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే వెంటనే థంబ్స్‌అప్ ఇస్తాడు. ఓవర్ల మధ్యలో వచ్చి ఆప్యాయంగా మాట్లాడతాడు. అతడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. విరాట్ లాంటి ఆటగాళ్లు లేకపోతే క్రికెట్ బోరింగ్‌గా మారిపోతుంది’ అని మాజీ అంపైర్ అనిల్ చౌదరి చెప్పారు.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదాల గురించి కూడా అనిల్ చౌదరి స్పందించారు. ‘ఉత్తర భారత ఆటగాళ్లలో సహజంగానే దూకుడు ఎక్కువ. అదే వారి ఆటతీరుకు బలం. ఆగ్రహం కూడా ఆటలో భాగమే. కానీ అది పరిమితి దాటకూడదు. ఎక్కువ ఆంక్షలు విధిస్తే ఆటలో ఉండే సహజమైన ఉత్సాహం తగ్గిపోతుంది’ అని వివరించారు. కోహ్లీ ఆడిన ఎన్నో మ్యాచ్‌లకు అనిల్ చౌదరి అంపైరింగ్ చేశారు. కోహ్లీపై అనిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ దూకుడు వెనుక ఉన్న నిజమైన వ్యక్తిత్వాన్ని మాజీ అంపైర్ వివరించారు.
నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ముందుగానే క్రీజు వదిలి పరుగులు ప్రారంభించే బ్యాటర్లను రనౌట్ చేయడంపై కూడా అనిల్ చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విధంగా ఔట్ చేయడం పూర్తిగా నిబంధనలకు అనుగుణమేనని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో హెచ్చరికలు, రన్ పెనాల్టీ వంటి కొత్త నిబంధనలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. నాన్-స్ట్రైకర్ ముందుగానే క్రీజు దాటితే అతనికి ప్రయోజనం లభిస్తుందని, అందుకే దీనిపై ఐసీసీ భవిష్యత్తులో కొత్త విధానం తీసుకురావచ్చు అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!