NTV Telugu Site icon

Mahakaleswar Temple: రిషబ్ పంత్ కోసం.. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో క్రికెటర్ల పూజలు

Mahakaleswar Temple

Mahakaleswar Temple

Indian Cricketers Offer Prayers At Ujjain’s Mahakaleswar Temple: ఉజ్జయిన మహాకాళేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు ప్రత్యేకపూజలు చేశారు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించే శివుడి భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ధోతీని ధరించి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పూజల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ కు వచ్చింది. ఇండోర్ లో మంగళవారం చివరిదైన మూడో వన్డే జరుగనుంది.

Read Also: Pakistan: అంధకారంలో పాకిస్తాన్.. కరాచీ, లాహోర్‌లలో కరెంట్‌కు అంతరాయం

ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ కోసం పూజలు నిర్వహించినట్లు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని మహకాల్ ను ప్రార్థించినట్లు తెలిపారు. డిసెంబర్ 30న రిషబ్ పంత్ కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు పంత్. పంత్ త్వరగా కోలుకుని జట్టులో చేరాలని ఆకాంక్షించారు. అతని పునరాగమనం మాకు చాలా ముఖ్యం అని, ఇప్పటికే న్యూజిలాండ్ తో సిరీస్ గెలిచామని.. వారితో జరిగే చివరి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. వరసగా ఏడో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.