SunRisers Hyderabad: టీ-20 చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డులు సాధించిన సన్‌రైజర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SunRisers Hyderabad: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఊచకోతతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 స్కోర్ చేసింది. ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ సాధించిన చరిత్ర సన్‌రైజర్స్ పేరుతో ఉంది. తాజాగా మరికొన్ని రికార్డులను సొంతం చేసుకుంది. పవర్ ప్లే, తొలి 10 ఓవర్లలో భారీ స్కోర్ చేసిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
టీ-20 హిస్టరీలోనే అత్యధిక పవర్ ప్లే స్కోర్ నమోదైంది. ట్రావిస్ హెడ్(83 రన్స్, 32 బాల్స్‌లో), అభిషేక్ శర్మ (46 రన్స్, 32 బాల్స్‌లో) ఊచకోతతో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. డీసీ సొంత స్టేడియంలో వారి బౌలర్లను ఊచకోత కోశారు. ఆరు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ ఏకంగా 125 రన్స్ చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో టీ20 ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లేలో ఏ జట్టు అయినా 125 మార్కులకు చేరుకోవడం ఇదే తొలిసారి.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోర్లు:
125/0 – SRH vs DC, 2024
105/0 – KKR vs RCB, 2017
100/2 – CSK vs PBKS, 2014
90/0 – CSK vs MI, 2015
88/1 – KKR vs DC, 2024
మరోవైపు తొలి 10 ఓవర్లలో ఎక్కువ స్కోరు సాధించిన చరిత్ర కూడా సన్‌రైజర్స్ తన పేరుతో లిఖించుకుంది. తనపై ఉన్న రికార్డును మరోసారి బద్ధలు కొట్టింది.
ఐపీఎల్లో తొలి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు
158/4 – SRH vs DC, ఢిల్లీ, ఈరోజు
148/2 – SRH vs MI, హైదరాబాద్, 2024
141/2 – MI vs SRH, హైదరాబాద్, 2024
135/1 – KKR vs DC, వైజాగ్, 2024
శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ మెరుపులతో భారీ స్కోర్ సాధించింది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!