NTV Telugu Site icon

SunRisers Hyderabad: టీ-20 చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డులు సాధించిన సన్‌రైజర్స్..

Srh

Srh

SunRisers Hyderabad: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఊచకోతతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 స్కోర్ చేసింది. ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ సాధించిన చరిత్ర సన్‌రైజర్స్ పేరుతో ఉంది. తాజాగా మరికొన్ని రికార్డులను సొంతం చేసుకుంది. పవర్ ప్లే, తొలి 10 ఓవర్లలో భారీ స్కోర్ చేసిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

టీ-20 హిస్టరీలోనే అత్యధిక పవర్ ప్లే స్కోర్ నమోదైంది. ట్రావిస్ హెడ్(83 రన్స్, 32 బాల్స్‌లో), అభిషేక్ శర్మ (46 రన్స్, 32 బాల్స్‌లో) ఊచకోతతో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. డీసీ సొంత స్టేడియంలో వారి బౌలర్లను ఊచకోత కోశారు. ఆరు ఓవర్లలో ఎస్ఆర్‌హెచ్ ఏకంగా 125 రన్స్ చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో టీ20 ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లేలో ఏ జట్టు అయినా 125 మార్కులకు చేరుకోవడం ఇదే తొలిసారి.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోర్లు:

125/0 – SRH vs DC, 2024
105/0 – KKR vs RCB, 2017
100/2 – CSK vs PBKS, 2014
90/0 – CSK vs MI, 2015
88/1 – KKR vs DC, 2024

మరోవైపు తొలి 10 ఓవర్లలో ఎక్కువ స్కోరు సాధించిన చరిత్ర కూడా సన్‌రైజర్స్ తన పేరుతో లిఖించుకుంది. తనపై ఉన్న రికార్డును మరోసారి బద్ధలు కొట్టింది.

ఐపీఎల్‌లో తొలి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు
158/4 – SRH vs DC, ఢిల్లీ, ఈరోజు
148/2 – SRH vs MI, హైదరాబాద్, 2024
141/2 – MI vs SRH, హైదరాబాద్, 2024
135/1 – KKR vs DC, వైజాగ్, 2024

శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ మెరుపులతో భారీ స్కోర్ సాధించింది.