NTV Telugu Site icon

IND vs NZ: 3 వికెట్లు కోల్పోయిన కివీస్.. లంచ్‌ బ్రేక్‌ వరకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..?

Nz

Nz

IND vs NZ: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్‌ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. క్రీజ్‌లో విల్‌యంగ్ (38*), డారిల్ మిచెల్ (11*) బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్‌ డెవన్ కాన్వే (4)ను ఔట్‌ చేసిన యువ పేసర్ ఆకాశ్‌ దీప్‌ టీమిండియాకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి స్పిన్నర్లను దించాడు. దీంతో వాషింగ్టన్‌ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా పదునైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ ను అడ్డుకున్నారు.

Read Also: Delhi Pollution : ఢిల్లీ గాలిలో జీవించడం అంటే రోజుకు ఎన్ని సిగరెట్లు తాగడంతో సమానమో తెలుసా ?

కాగా, ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ టామ్‌ లేథమ్‌ (28), రచిన్‌ రవీంద్ర (5)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా.. వీరిద్దరినీ బౌల్డ్‌ అవడం గమనార్హం. ఆ తర్వాత డారిల్ మిచెల్‌తో కలిసి విల్‌ యంగ్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలో 20 రన్స్ జోడించారు. అయితే, రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్‌ ఈ మ్యాచ్‌లోనూ మరోసారి తన విశ్వరూపం చూపిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ రెండు మార్పులు చేసింది. టిమ్‌ సౌథీ స్థానంలో మ్యాట్‌ హెన్రీ, మిచెల్‌ సాంట్నర్‌ గాయపడటంతో అతని స్థానంలో ఐష్‌ సోధి తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్‌ సైతం ఓ మార్పు చేయగా.. బుమ్రా స్థానంలో సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు.

Show comments