ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ ముహుర్తానా స్టార్ట్ అయిందో తెలియదు కానీ క్రికెట్ అభిమానులకు ధోని ఫీవర్ పట్టుకుంది అని మాత్రం చెప్పగలం.. ధోని ఎక్కడికి వెళ్లినా అతనికి వస్తున్న క్రేజ్ మాత్రం ఒకేలా ఉంటుంది. తాజాగా ఇవాళ ( శనివారం ) ఢిల్లీ క్యాపిటల్స్ తో సీఎస్కే మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నై టీమ్ స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జన సంద్రంతో నిండిపోయాయి.
Also Read : Assam: “నో జీన్స్, లెగ్గింగ్స్”.. గవర్నమెంట్ టీచర్లకు డ్రెస్ కోడ్..
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు. కొందరు కార్ల బానెట్లపై నిలబడి మరీ తమ అభిమాన ఆటగాడికి చేతులుపారు.. ఎంఎస్ ధోనిని చూడడానికి చాలా మంది రావడంతో బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాసేపు ఉత్కంఠ నెలకొనప్పటికి ఆ తర్వాత బస్సుకు దారి ఇచ్చారు.
Also Read : NTR: నా బాధల్లో.. సంతోషాల్లో తోడున్నది మీరే.. గుండెలను పిండేస్తున్న ఎన్టీఆర్ లేఖ
అయితే అభిమానానికి హద్దులుండవని ఈ సంఘటనతో మరోసారి రుజువు అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. సరిహద్దు లేని అభిమానం అంటే ఇదే అంటూ కామెంట్ చేశారు. ఇక సీఎస్‌కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఒక్కడి కోసం రాజధాని నగరం జనంతో నిండిపోయింది. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక సీఎస్‌కే ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం సీఎస్‌కే 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Fans behind the CSK bus in Delhi.
This is madness. pic.twitter.com/P594b5r8QL
— Johns. (@CricCrazyJohns) May 20, 2023