Site icon NTV Telugu

IPL 2023: అతను మా బంగారు కొండ అంటున్న పంజాబ్ కింగ్స్

Sharuk Khan

Sharuk Khan

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆద్యంతం ఉత్కంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 2 రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సికిందర్ రజా హాఫ్ సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆఖర్ లో సికిందర్ రజా ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ షారూఖ్ ఖాన్ తన సూపర్ స్మార్ట్ ఇన్సింగ్స్ తో పంజాబ్ ను విజయతీరాలకు చేర్చాడు.

Also Read : LSG vs PBKS: లక్నోపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. లాగేసుకున్నారుగా!

అయితే షారూఖ్ ఖాన్ చేసింది 23 పరుగులే కావొచ్చు.. కానీ ఒత్తిడిలో అతను పంజాబ్ నె గెలిపంచిన విధానం సూపర్ అని చెప్పొచ్చు.. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్సింగ్స్ సమయంలో షారూఖ్ ఖాన్ రెండు స్టన్నింగ్ క్యాచ్ లతో మెరిశాడు. బౌండరీ లైవ్ వద్ద కష్టసాధ్యంగా అనిపించిన క్యాచ్ లను బౌండరీ లైన్ తొక్కకముందే బంతిని గాల్లోకి ఎగరేసి బ్యాలెన్స్ చేసుకొని మళ్లీ బౌండరీ లైన్ ఇవతలకు వచ్చి స్మార్ట్ గా క్యాచ్ లు తీసుకున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే దాదాపు రెండు క్యాచ్ లను ఒకేలా తీసుకున్న షారూఖ్ ఖాన్ స్మార్ట్ నెస్ ఉపయోగించాడు.

Also Read : Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..

అలా శనివారం జరిగిన మ్యాచ్ లో సికందర్ రజాతో పాటు షారూఖ్ ఖాన్ కూడా పంజాబ్ కింగ్స్ కు హీరో అయ్యాడు. షారూఖ్ ఖాన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజంగా షారూఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్ కు దొరికిన ఒక వరం.. అతన్ని ఉపయోగించుకుంటే తెలివిగా మ్యాచ్ లను గెలవొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.

Exit mobile version