జాతీయస్థాయి రెజ్లర్ నిషా దహియా ఆమె సోదరుడు కాల్పుల్లో మృతిచెందినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బుధవారం హరియాణా సోనిపట్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిషా దహియా ఆమె సోదరుడు సూరజ్ పై కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందినట్లు వార్తల సారాంశం.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని నిషా దహియా ట్విట్టర్ లో ఒక వీడియో ద్వారా తెలిపారు. ” నేను చనిపోలేదు.. ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ లోని గోండాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను.. ఆ వార్తలు అన్ని ఫేక్.. వాటిని నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నిషా .. ఇటీవలే సెర్బియాలో జరిగిన అండర్ -23 విభాగంలో కాంస్య పతకం సాధించారు. అనంతరం ఆమెను ప్రధాని మోదీ కూడా అభినందించిన విషయం తెల్సిందే..
#WATCH | "I am in Gonda to play senior nationals. I am alright. It's a fake news (reports of her death). I am fine," says wrestler Nisha Dahiya in a video issued by Wrestling Federation of India.
— ANI (@ANI) November 10, 2021
(Source: Wrestling Federation of India) pic.twitter.com/fF3d9hFqxG