Ind vs Eng 3rd T20: వరుణ్ చక్రవర్తి మెరిసినా.. మూడో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి
- మూడో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి
- మూడో టీ20లో భారత్ పై ఇంగ్లాండ్ గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 రసవత్తరంగా సాగింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. వరుణ్ చక్రవర్తి మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడినా ఓటమి తప్పలేదు. సిరీస్ పై కన్నేసిన భారత్ కు నిరాశ తప్పలేదు. మూడోటీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ లో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది.
హార్థిక్ పాండ్య 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు బాది 40 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సంజూశాంసన్ 3, అభిషేక్ శర్మ 24, సూర్య కుమార్ యాదవ్ 14, తిలక్ వర్మ 18, వాషింగ్టన్ సుందర్ 6,అక్షర్ పటేల్ 15, ధ్రువ్ జురెల్ 2, మహ్మద్ శమీ 7, రవి బిష్ణోయ్ 4, వరుణ్ చక్రవర్తి 1 పరుగులు సాధించారు.ఇంగ్లండ్ బౌలర్లలో జామి ఓవర్టన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్సే తలో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.
Also Read
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 మంది ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లను పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 28 బంతుల్లో అత్యధికంగా 51 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. భారత్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణేలో జరుగనుంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?