Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports England Player Eoin Morgan Decided Retirement To All Formats Of Cricket

Cricket: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. కారణమేంటి?

Published Date :June 28, 2022 , 11:50 am
By Ramesh Nalam
Cricket: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. కారణమేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు తన రిటైర్మెంట్‌పై మోర్గాన్ ప్రకటన చేసే అవకాశముంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని మోర్గాన్ తొలుత భావించినా ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకోవడానికే అతడు ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటం, పేలవ ఫామ్ వంటి అంశాల కారణంగా మోర్గాన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ అంశంపై పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మోర్గాన్‌కు 36 ఏళ్లు. అతడు గత 28 ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇటీవల ముగిసిన నెదర్లాండ్స్ సిరీస్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. మూడో మ్యాచ్‌లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఫామ్ లేమి కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలోనూ మోర్గాన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

Read Also: Team India: అరుదైన రికార్డు సాధించిన హార్డిక్ పాండ్యా

2014లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న మోర్గాన్ జట్టును అద్వితీయంగా ముందుకు నడిపించాడు. వన్డే, టీ20ల్లో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడి సారథ్యంలోని జట్టు 2019లో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. ఇప్పటివరకు 126 వన్డేలు, 72 టీ20లకు సారథ్యం వహించిన 35 ఏళ్ల మోర్గాన్ 248 వన్డేల్లో 7,701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 2,458 పరుగులు చేశాడు. 16 టెస్టు మ్యాచ్‌లకు కూడా మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి మోర్గాన్ తప్పుకుంటే.. అతడి స్థానంలో జాస్ బట్లర్ లేదా మొయిన్ అలీలలో ఒకరు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • eion morgan
  • england
  • england captain
  • retirement

తాజావార్తలు

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

  • Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions