NTV Telugu Site icon

Dwayne Bravo: ధోనీ అందుకే బ్యాటింగ్‌కి దిగడు.. డ్వేన్ బ్రావో క్లారిటీ

Bravo On Ms Dhoni

Bravo On Ms Dhoni

Dwayne Bravo Reveals The Reason Behind Why Dhoni Coming In Lower Order: ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో వస్తున్న విషయం తెలిసిందే! ఓవైపు అభిమానులు ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటే.. ధోనీ మాత్రం ఆరు వికెట్లు పడేదాకా క్రీజులోకి అడుగుపెట్టట్లేదు. ఓవైపు ధోనీ బ్యాటింగ్‌కి రావాలని ఫ్యాన్స్ అందరూ ప్రతీ మైదానంలో నినాదాలు చేస్తున్నా, ప్లకార్డులు పట్టుకొని కోరుతున్నా.. తన కంటే ముందు జడేజాను బ్యాటింగ్‌కు పంపుతున్నాడే గానీ తాను మాత్రం రావట్లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. మరీ ముఖ్యంగా.. రాయస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్ సమయంలో ధోనీ రాకపోవడంతో.. ఫ్యాన్స్‌ని మరింత డిజప్పాయింట్ చేసింది. ఈసారి జడేజాని పంపకుండా తానే బరిలోకి దిగి, మ్యాచ్‌ని త్రిల్లింగ్‌గా మారుస్తాడని అంతా భావిస్తే.. ధోనీ మాత్రం ఎప్పట్లాగే జడేజాని పంపించి ఉసూరుమనిపించాడు. ఇక అప్పటి నుంచి.. ధోనీ ఎందుకిలా చేస్తున్నాడు? త్వరగా బ్యాటింగ్‌కి ఎందుకు రావట్లేదు? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Brahmaji: కుక్కపిల్లలా ఉండాలి మా ఆవిడ దగ్గర.. గొడవైతే ఏం చేస్తానంటే..?

ఈ క్రమంలోనే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రేవో స్పందించాడు. ధోనీ త్వరగా బ్యాటింగ్‌కు రాకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. జడేజా, రాయుడు, దూబే లాంటి వాళ్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే.. ఫినిషింగ్ రోల్‌ను ధోనీ ఎంపిక చేసుకున్నాడని స్పష్టం చేశాడు. మిడిలార్డర్‌లో వారిని పంపించి.. లోయర్ ఆర్డర్ బాధ్యతను ధోనీ తీసుకున్నాడని తెలిపాడు. ఈ విషయంలో ధోనీ చాలా సంతోషంగానే ఉన్నాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. తమ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీరు కూడా చాలా వేరు అని చెప్పాడు. తమ జట్టుకి ఫలితాలతో సంబంధం ఉండదని, బాగా రాణిస్తున్నామా? లేదా? అనేది పట్టించుకోకుండా తమ జట్టు కొనసాగుతుందని అన్నాడు. తాము ఈ సీజన్‌ని సానుకూలంగానే ప్రారంభించామని చెప్పిన బ్రావో.. మరిన్ని మ్యాచ్‌లను గెలవాల్సి ఉందని వివరించాడు. కాగా.. రాయస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 32 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ 202 పరుగులు చేయగా.. లక్ష్య ఛేధనలో భాగంగా సీఎస్కే 170 పరుగులకే పరిమితం అయ్యింది.

Amit Shah: కాంగ్రెస్‌కు మైండ్ దొబ్బింది.. “విష సర్పం” వ్యాఖ్యలపై ఫైర్