Dwayne Bravo: ధోనీ అందుకే బ్యాటింగ్‌కి దిగడు.. డ్వేన్ బ్రావో క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dwayne Bravo Reveals The Reason Behind Why Dhoni Coming In Lower Order: ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో వస్తున్న విషయం తెలిసిందే! ఓవైపు అభిమానులు ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటే.. ధోనీ మాత్రం ఆరు వికెట్లు పడేదాకా క్రీజులోకి అడుగుపెట్టట్లేదు. ఓవైపు ధోనీ బ్యాటింగ్‌కి రావాలని ఫ్యాన్స్ అందరూ ప్రతీ మైదానంలో నినాదాలు చేస్తున్నా, ప్లకార్డులు పట్టుకొని కోరుతున్నా.. తన కంటే ముందు జడేజాను బ్యాటింగ్‌కు పంపుతున్నాడే గానీ తాను మాత్రం రావట్లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. మరీ ముఖ్యంగా.. రాయస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్ సమయంలో ధోనీ రాకపోవడంతో.. ఫ్యాన్స్‌ని మరింత డిజప్పాయింట్ చేసింది. ఈసారి జడేజాని పంపకుండా తానే బరిలోకి దిగి, మ్యాచ్‌ని త్రిల్లింగ్‌గా మారుస్తాడని అంతా భావిస్తే.. ధోనీ మాత్రం ఎప్పట్లాగే జడేజాని పంపించి ఉసూరుమనిపించాడు. ఇక అప్పటి నుంచి.. ధోనీ ఎందుకిలా చేస్తున్నాడు? త్వరగా బ్యాటింగ్‌కి ఎందుకు రావట్లేదు? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.
Brahmaji: కుక్కపిల్లలా ఉండాలి మా ఆవిడ దగ్గర.. గొడవైతే ఏం చేస్తానంటే..?
Also Read
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!

ఈ క్రమంలోనే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రేవో స్పందించాడు. ధోనీ త్వరగా బ్యాటింగ్‌కు రాకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. జడేజా, రాయుడు, దూబే లాంటి వాళ్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే.. ఫినిషింగ్ రోల్‌ను ధోనీ ఎంపిక చేసుకున్నాడని స్పష్టం చేశాడు. మిడిలార్డర్‌లో వారిని పంపించి.. లోయర్ ఆర్డర్ బాధ్యతను ధోనీ తీసుకున్నాడని తెలిపాడు. ఈ విషయంలో ధోనీ చాలా సంతోషంగానే ఉన్నాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. తమ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీరు కూడా చాలా వేరు అని చెప్పాడు. తమ జట్టుకి ఫలితాలతో సంబంధం ఉండదని, బాగా రాణిస్తున్నామా? లేదా? అనేది పట్టించుకోకుండా తమ జట్టు కొనసాగుతుందని అన్నాడు. తాము ఈ సీజన్‌ని సానుకూలంగానే ప్రారంభించామని చెప్పిన బ్రావో.. మరిన్ని మ్యాచ్‌లను గెలవాల్సి ఉందని వివరించాడు. కాగా.. రాయస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు 32 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ 202 పరుగులు చేయగా.. లక్ష్య ఛేధనలో భాగంగా సీఎస్కే 170 పరుగులకే పరిమితం అయ్యింది.
Amit Shah: కాంగ్రెస్‌కు మైండ్ దొబ్బింది.. “విష సర్పం” వ్యాఖ్యలపై ఫైర్
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?