Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచింది. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం నిబంధనల ప్రకారం.. ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ జోన్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఐదవ రోజులో మొత్తంగా 7 వికెట్ల నష్టానికి 388 రన్స్ చేసింది. ఖురైషీ 116 పరుగులతో, షమీ 0తో అజేయంగా నిలిచారు. చివరి రోజు ఆటలో రెండు వికెట్స్ కోల్పోయిన ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను ముగించింది. సౌత్ జోన్‌కు మ్యాచ్‌ను గెలిచే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల మధ్య పోరు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యమే ఈస్ట్ జోన్‌కు టైటిల్‌ను అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ విజయంతో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ నేతృత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో డ్యాన్స్ చేస్తూ భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 708 పరుగులు చేయగా.. సౌత్ జోన్ 336 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్‌కు ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఈస్ట్ జోన్ 388/7 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!