Dinesh Karthik : ఛాన్స్ వస్తే.. ధోని మైండ్ లో ఏముందో చదివేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పని ఇక అయిపోయిందని అనుకున్న తరుణంలో భారత జట్టులోకి ఎవ్వరు ఉహించని విధంగా పురాగమనం చేశాడు. IPL 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో కీపర్, బ్యాటర్‌గా రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
దక్షిణఫ్రికాతో రెండో టీ20కి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసిన ఓ వీడియోలో దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. డీకేని పలు ప్రశ్నలు అడగ్గా.. సరదాగా సమాధానాలిచ్చాడు. మీకు ఎగిరిపోవడం ఇష్టమా? లేక ఎవరిదైనా బుర్ర చదవడం ఇష్టమా? అని అడగ్గా.. ‘నాకు ఎగిరిపోయే అవకాశం వస్తే అలస్కా (అమెరికా) వెళ్లిపోతా. ఆ ప్రాంతం గురించి చాలా విషయాలు విన్నాను. ఇతరుల బుర్ర చదివే అవకాశం వస్తే మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైండ్‌ను చదువుతా’ అని డీకే బదులిచ్చాడు.
Also Read
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
- Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
- Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
- Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా'.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
టీ ఇష్టమా? లేదంటే కాఫీనా? అని అడిగితే.. తనకు టీ అంటేనే చాలా ఇష్టమని, భారత దేశంలో ఎక్కడకు వెళ్లినా కూడా మంచి టీ సులభంగా దొరుకుతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. జట్టుతో డిన్నర్ చేయడం ఇష్టమా? సినిమాకు వెళ్లడం ఇష్టమా? అని అడిగితే.. టీమ్ డిన్నర్ అంటేనే ఇష్టమని, ఆటగాళ్లతో భోజనం చేయడం చాలా బాగుంటుందన్నాడు. ఏదైనా పార్టీలో పాడటం ఇష్టమా? లేక డాన్స్ చేయడం ఇష్టమా? అడగ్గా.. చాలా కష్టమైన ప్రశ్న అని, తాను రెండింటిలో ఏదీ చేయలేను అని డీకే చెప్పాడు.
తనకు టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ అంటే చాలా ఇష్టమని, ఫుట్‌బాల్‌లో లియోనియల్ మెస్సీ ఆటతీరు బాగా నచ్చుతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. తన జీవితంపై పుస్తకం కన్నాసినిమా వస్తే బాగుంటుందన్నాడు. వంట చేయడం కంటే ఇంటిని శుభ్రం చేయడానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నాడు. ఇన్స్టాగ్రామ్ కంటే ట్విట్టర్ కే డీకే ఓటేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకేకు.. తొలి టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. కేవలం రెండు బంతులే ఎదుర్కున్నాడు. బారాబటి స్టేడియంలో జరిగే రెండో టీ20 కోసం డీకే సన్నద్ధం అవుతున్నాడు.
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!